సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఆఫీస్ సమీపంలోని విగ్నేశ్వర ఫంక్షన్ హాల్లో గురువారం ప్రారంభమైన సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు.జిల్లా నలుమూలల నుండి శిక్షణా తరగతులకు హాజరైన పార్టీ శ్రేణులకు ఆయన”వర్తమాన రాజకీయ పరిస్థితులు” అనే అంశంపై క్లాస్ బోధిస్తున్నారు.
వేదికపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి,సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఉన్నారు.