సూర్యాపేట జిల్లా:విలేకరిపై అసభ్య పదజాలంతో దూషించిన పెన్ పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం గ్రామ సర్పంచ్ చెన్ను శ్రీనివాసరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు ధనియాకుల వెంకటేశ్వర్లు,అధ్యక్షుడు ఓగ్గు సోమన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం మండల కేంద్రంలో మన తెలంగాణ పెన్ పహాడ్ మండల రిపోర్టర్ పై సర్పంచ్ అసభ్య బూతు పురాణంపై నల్ల బాడ్జిలతో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలియచేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనతెలంగాణ పత్రిక విలేకరి నల్లగంతుల సైదులు తన విధి నిర్వహణలో భాగంగా అనాజీపురం గ్రామానికి వెళ్లి గ్రామపంచాయతీ పనులపై సమాచారాన్ని సేకరిస్తున్న సందర్భంలో విషయాన్ని తెలుసుకున్న సర్పంచ్ చరవాణి ద్వారా అసభ్యపదజాలంతో దూషిస్తూ సభ్య సమాజం వినడానికి,రాయడానికి కూడా వీలులేని బూతులు తిడుతూ,నిన్ను చంపుతానని బెదిరించడం హేయమైన చర్య అన్నారు.నీకు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరింపులకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే విలేకరిని దూషించినందుకు సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకొవాలని,లేనిపక్షంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి నాగేశ్వరరావు,గౌరవ సలహాదారులు చలిగంటి పుల్లయ్య,సురభి రాంబాబు,ఉపాధ్యక్షుడు నల్లగంతుల సైదులు, కోశాధికారి తుమ్మకొమ్మ సంజయ్,మండల పాత్రికేయులు సట్టు వెంకటేశ్వర్లు,పాలకురి రవికుమార్,కొలిపాక వంశీకృష్ణ,మీసాల నాగయ్య, బొల్లికొండ వీరస్వామి,కీర్తి యలమంచయ్య,నన్నేపంగ నవీన్,జిల్లేపల్లి వెంకటేశ్వర్లు,గంగారపు హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.