నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో అమలు అవుతున్న పథకాల్లో లీకేజీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.దేశంలో ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా కృషి చేస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా పేదలకు అందేలా నగదు బదిలీ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తే అంత మొత్తం నేరుగా ప్రజలకు చేరుతోందని స్పష్టం చేశారు.