గంజాయి నియంత్రణకై టీజేఎస్ 2కె రన్

సూర్యాపేట జిల్లా:ఆర్థికంగా,ఆరోగ్య పరంగా జీవితాలను ఛిద్రం చేస్తున్న గంజాయికి యువత దూరంగా ఉండాలని పముఖ వైద్యులు,ఐఎంఏ సూర్యాపేట పట్టణాధ్యక్షుడు డా.బి.

 Tjs 2k Run To Control Ganja-TeluguStop.com

ఎం.చంద్రశేఖర్, తెలంగాణ జనసమితి నియోజకవర్గ ఇంచార్జి ధర్మార్జున్ లు పిలుపునిచ్చారు.గంజాయి,మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన 2కె రన్ ను స్థానిక కొత్త బస్టాండ్ వద్ద డా.చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు.జాతీయ పతాకాలు చేబూని జనసమితి నాయకులు కార్యకర్తలు సూర్యాపేట వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ధర్మార్జున్ మాట్లాడుతూ సూర్యాపేటను గంజాయికి అడ్డాగా మార్చుకొని సాగిస్తున్న గంజాయి దందాను అరికట్టాలని కోరారు.

చిన్న పిల్లలను టార్గెట్ గా చేసుకుని ఈ ముఠా వ్యాపారాన్ని కొనసాగిస్తుందని, ఫలితంగా విద్యార్థులు,యువత ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి ప్రవాహం జరుగుతుంటే అరికట్టడంలో పాలకులు,అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.

ఒకవైపు ప్రభుత్వం ఊరుకో వైన్స్,గల్లికో బెల్ట్ షాపు ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రజలను త్రాగుడుకు బానిసలుగా మార్చి ప్రశ్నించే తత్వాన్ని నీరుగారుస్తోందనని విమర్శించారు.ఈ గంజాయి మూలంగా యువకుల జీవితాలు ఛిద్రమవుతున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసమితి రాష్ట్ర నాయకులు గట్ల రమాశంకర్,జిల్లా అధ్యక్షుడు మంద్ర మల్లయ్య,జిల్లా ఉపాధ్యక్షుడు కంబాల పల్లీ శ్రీను, లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ కుంచం చంద్రకాంత్,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రఫీ,విద్యార్ధి జనసమితి జిల్లా అధ్యక్షుడు వినయ్ గౌడ్,ఉపాధ్యక్షుడు ఈశ్వర్ సింగ్, పట్టణ ప్రథాన కార్యదర్శి పగిళ్ళ శ్రీను,జిల్లా నాయకులు వీరెస్,ఎస్టి సెల్ పట్టణ కన్వీనర్ సతీష్, అక్తర్,ప్రవీణ్,శ్రవణ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube