ఐశ్వర్య రెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి ఘన నివాళి...!

సూర్యాపేట జిల్లా: అమెరికా డల్హాస్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణంచిన ఐశ్వర్య రెడ్డి మృతదేహానికి గురువారం మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించారు.మంత్రి జగదీష్ రెడ్డితో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా నివాళలర్పించారు.

 Minister Jagdish Reddy Pays Tribute To Aishwarya Reddy, Minister Jagdish Reddy ,-TeluguStop.com

డల్హాస్‌లో ఉన్నతవిద్యనభ్యసిస్తున్న కుమారి ఐశ్వర్య రెడ్డి ఆచూకీ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకురాగా తక్షణం స్పందించి అమెరికా కాన్సులేట్‌తో సంప్రదింపులు జరిపారు.

ఆచూకీ తెలుసుకొనడంతో పాటు జరిగిన ఘోరం తెలియడంతో నిశ్చేష్టులైన మంత్రి జగదీష్ రెడ్డి విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఐశ్వర్య రెడ్డి పార్థివ దేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే గురువారం నగరానికి చేరుకున్న అనంతరం ఐశ్వర్య మృతదేహాన్ని ఆమె స్వస్థలం నేరేడుచర్లకు అంత్యక్రియలు నిమిత్తం తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube