సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ మండలంబూరుగడ్డ గ్రామంలో 186 మంది నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇచ్చిన ప్రభుత్వ భూమి ఎక్కడుందో లబ్దిదారులకు చూపెట్టలని బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దేశగాని సాంబశివ గౌడ్ డిమాండ్ చేశారు.సోమవారం హుజూర్ నగర్ ఆర్డీవో కె.
వెంకారెడ్డికి బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) హుజూర్ నగర్ మండల కన్వీనర్ మేరుగు మట్టపల్లి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.
బూరుగడ్డ గ్రామంలో సర్వే నెంబర్ 15,16 లో గల ప్రభుత్వ భూమి ఎమ్మార్వో ఫైల్ నెంబర్ B/378/ 2004 మరియు ఆర్డీవో ఫైల్ నెంబర్ EI/4995/06 ల ప్రకారం ఇళ్ళ స్థలాల కోసం పట్టాలు ఇచ్చినారని అన్నారు.
కానీ,ఇప్పుడు ఆ స్థలాలు ఎక్కడున్నాయో లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలకు చూపించకపోవడం బాధాకరమని అన్నారు.
బూరుగడ్డ నిరుపేదలకు బీఎస్పీ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, పేదల అభ్యున్నతికి పాటుపడుతుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ సూర్యాపేట జిల్లా ఇన్చార్జి చెడపకు రవికుమార్, హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లగాని సుబ్బు గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జ్ కొండమీది నరసింహారావు, నియోజకవర్గ అధ్యక్షులు మంద రవి,నియోజకవర్గ మహిళా కన్వీనర్ రమణ, నియోజకవర్గ కోశాధికారి సయ్యద్ హుస్సేన్,నేరేడుచర్ల మండల కన్వీనర్ వాస కరుణాకర్, మఠంపల్లి మండల మహిళా కన్వీనర్ ఎస్.కె నాగుల్ బీ,మాదాస్ గోపి తదితరులు పాల్గొన్నారు.