బీఆర్ఎస్ కు షాకిచ్చిన శానంపుడి...!

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో అధికారం కోల్పోయి కంగారు పడుతున్న కారుపార్టీకి ఆ పార్టీ నేతలు షాకుల మీద షాకులిస్తున్నారు.అధికారంలో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించిన వారు అధికారం పోగానే పక్కచూపులు చూస్తున్నారు.

 Shanampudi Saidi Reddy Joins Bjp Party, Shanampudi Saidi Reddy , Bjp Party, Sury-TeluguStop.com

ఆ కోవలోనే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి కూడా చేరిపోయారు.ఆదివారం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు.

నల్లగొండ పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచే అవకాశం ఉందని,ఆ హామీతోనే కమలంపై కన్నేసినట్లు జిల్లా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.దీనితో హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో గులాబీ పార్టీకి ఇది గట్టి దెబ్బగనే చెప్పాలి.

ఇదిలా ఉంటే ఇంత స్వచ్చంద సంస్థ ద్వారా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ,గత ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి,చివరికి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి ఎమ్మేల్యే అభ్యర్ధిగా బరిలో నలిచిన పిల్లుట్ల రఘు బీఆర్ఎస్ లో చేరి నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube