సూర్యాపేట జిల్లా:నేడు హుజూర్ నగర్( Huzur Nagar ) లో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఆటంకం కలిగిస్తారనే ఆలోచనతో పోలీసులు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతిపక్ష,ప్రజా సంఘాల,మలిదశ తెలంగాణ ఉద్యమకారులను కూడా మంగళవారం తెల్లవారు జాము నుండే ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.దీనిపై ఆయా వర్గాలు మండిపడుతున్నాయి.
లక్షల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాటలు నిజమైతే ప్రజలను,ప్రజా నాయకులను,చివరికి ఉద్యమకారులను కూడా అరెస్ట్ చేయడం దేనికని ప్రశ్నించారు.హామీలు ఇచ్చి అమలు చేయకపోగా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అవేవి పట్టించుకోకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని ముందస్తు అరెస్టులు చేయడంపై భగ్గుమంటున్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో రాయినిగూడెంకు చెందిన పిడమర్తి నాగరాజు( Pidamarthi Nagarju )ను తెల్లవారుజామున అతను నిద్ర లేవకముందే ఇంటికి వచ్చిన పోలీసులు అరెస్టు చేయడం దేనికి నిదర్శనం అన్నారు.తెలంగాణ కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెడితే ఉద్యమకారులకుదక్కిన గౌరవం ఇదేనా అనినాగరాజు వాపోయాడు.
ఉద్యోగాలు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్( CM KCR ) ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెండు కాళ్లు,ఒక చేయి పోగొట్టుకున్న నన్ను పోలీసులు అక్రమ అరెస్టు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.హుజూర్ నగర్ ఇండ్ల సాధన కమిటీ సభ్యులు విజయ్ ని ముందు హౌస్ అరెస్టు చేసి అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మఠంపల్లి పోలీస్ స్టేషన్ లో తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులు భిక్షం,చందర్రావులను పోలీసులు అరెస్టు చేశారు.నియోజకవర్గంలో ప్రతీ మండలంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి
.