మిచౌంగ్ తుఫాన్ భీభత్సం

సూర్యాపేట జిల్లా:గత రెండు రోజులుగా కురుస్తున్న మిచౌంగ్ తుఫాన్( Cyclone Michaung ) తో సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం( Ananthagiri mandal )లో పంటలు తీవ్రంగా నష్టపోయి రైతన్నలు విలవిలలాడుతున్నారు.చేతికొచ్చిన పంట తుఫాన్ ప్రభావంతో నోటి కాడికి రాకుండా పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 Michoung Typhoon Terror-TeluguStop.com

అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు మీసాల ఏసోబు మాట్లడుతూ ఎకరం పొలంలో వేసిన బంతి తోట పూర్తిగా నీట మునిగి మొక్కలు నేలకు వాడడంతో భారీ నష్టం వాటిల్లిందని వాపోయారు.

సుమారు లక్ష రూపాయల పెట్టుబడితో బంతి తోట వేశానని అనుకోకుండా వచ్చిన తుఫానుతో ఆర్థికంగా నష్టపోయినట్టు చెప్పారు.

గోండ్రియాల గ్రామంలో వరి పంట నేలకొరిగి నష్టపోయినట్టు మరోరైతు ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు స్పందించి కౌలు రైతులకు రైతులకు ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube