నల్లగొండ జిల్లా:కేతేపల్లి మండలం కొర్లపహడ్( Korlapahad ) గ్రామ దళిత వాడలో విద్యుత్ స్తంభం కూలి ప్రమాదకారంగా మారి రెండు రోజుల అయినా విద్యుత్ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడలేదని కాలనీ వాసులు ఆరోపించారు.నాడు గత ప్రభుత్వలు దళిత వాడలకు ఉచిత విద్యుత్ సరఫరా( Free electricity supply ) చేశారు.
నేడు స్వరాష్ట్రంలో ఇంటింటికి ఉచిత విద్యుత్ అని నేతలు ఉదరగొట్టుడే కానీ,ఆచరణలో మాత్రం శూన్యమని తెలపడానికి ఈ ఘటనే నిదర్శనమనిఅంటున్నారు.దళిత వాడలో వర్షాకాలం కావడంతో స్తంభం విరిగి ఇంటిపై పడడంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కు మంటున్నామన్నారు.
దాదాపు రెండు నెలల క్రితం విద్యుత్ అధికారులు గ్రామంలో ఉన్న దళితులు కూడా కరెంటు బిల్లు కట్టాలని,లేదంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హేచ్చరికలు జారీచేశారని,ప్రభుత్వంమే ఉచిత కరెంటని చెప్పి,ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టాలి అనడం ఏంటని ప్రజలు అధికారులను నిలదీయడంతో అక్కడ నుండి అధికారులు తప్పించుకున్నారు.స్తంభం విరిగిపడి రెండు రోజులు అవ్వుతున్నా దళితుల కరెంట్ బిల్లు కట్టడం లేదనే వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.విరిగిన స్తంభం వలన గ్రామంలో ఉన్న ఇండ్లు మొత్తం కాలిపోయే ప్రమాదం ఉందని,విద్యుత్ అధికారు ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే ప్రజా ప్రతినిధులు స్పంచడం లేదని,ఇప్పటికైనా అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ విరిగిన స్థంభం స్థానంలో కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.