మహిళలకు పురుషులతో పాటు సమాన అవకాశాలు ఏవీ...!

సూర్యాపేట జిల్లా:విద్యా, ఉద్యోగాలలో పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, మహిళల పట్ల చిన్నచూపు విడనాడాలని పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నర్సమ్మ అన్నారు.

 Women Have No Equal Opportunities With Men ,women, Men ,,women Equal Opportuniti-TeluguStop.com

అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా బుధవారం సూర్యాపేట జిల్లా మోతె మండలం రాయిపహాడ్ గ్రామంలో పార్టీ నాయకురాలు నీలమ్మ అధ్యక్షత నిర్వహించిన మహిళా సదస్సుకు ఆమె ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న ఆధునిక సమాజంలో కూడా మహిళలు,విద్యార్థునిలపై మరింతగా దాడులు, హింస,హత్యలు, హత్యాచారాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

స్త్రీకి ఆర్థిక,రాజకీయ, సామాజిక సమానత్వం కల్పించడంలో పాలకులు వైఫల్యం చెందుతున్నారని విమర్శించారు.

స్త్రీని సంతాన ఉత్పత్తి చేసే సాధనంగానే ఈ సమాజం చూస్తుందని,ఈ ధోరణిని వ్యతిరేకించాలని అన్నారు.ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు కుటుంబానికి సేవ చేస్తూ వెట్టి చేస్తుందని,అయినా స్త్రీకి గుర్తింపు లేకుండా పోయిందన్నారు.

ప్రేమ పేరుతో మహిళపై జరుగుతున్న హత్యలకు వ్యతిరేకంగా ఈ సమాజం నినదించాలని సూచన చేశారు.స్త్రీని అవసరాలు తీర్చుకుని మాంసపు ముద్దగానే వాడుకుంటున్నారని,ఇది సమాజానికి పెను ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు.

స్త్రీని ద్వితీయ శ్రేణి పౌరురాలుగా చూస్తూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ప్రభుత్వాలు కూడా మోసం చేస్తున్నాయని,అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న మహిళల పట్ల ప్రభుత్వాలు వివక్షతను కొనసాగిస్తున్నాయని ఆరోపించారు.మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య ఉద్యమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు శీలం భవాని,కొత్తపల్లి నీలమ్మ, మహేశ్వరి,పొడపంగి అంతమ్మ,మహబూబా, ఎల్లమ్మ,వెంకటమ్మ, కొత్తపల్లి ఎల్లమ్మ, తిరుపమ్మ,జానమ్మ, నాగమణి,పివైల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు, కాకి మోహన్ రెడ్డి, ముత్తయ్య,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube