లింగ నిర్థారణ చేసి అబార్షన్ చేయడానికి సహకరించిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ నాగభూషణం గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ నెల 6న జిల్లా వైద్యాధికారి కోటాచలం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంజీవని ఆసుపత్రిలో ఒక మహిళ అబార్షన్ చేసుకుందని, మరో మహిళకు అబార్షన్ చేసేందుకు సిద్ధంగా ఉందని,బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా విచారణ చేసినట్లు వెల్లడించారు.
దిర్శించర్ల గ్రామానికి చెందిన వడ్త జ్యోతి మొదటి సంతానం కుమార్తె కాగా రెండవ సారి గర్భందాల్చి ఐలాపురం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ శ్రవణ్‌ను సంప్రదించగా ఖమ్మంకు చెందిన అశోక్‌తో కడుపులో ఉన్నది ఆడపిల్ల అని నిర్థారించుకున్నారు.దీంతో ఆర్‌ఎంపీ శ్రవణ్‌ను అబార్షన్ చేయించాలని కోరగా సంజీవని ఆసుపత్రి నిర్వాహకులు మద్దెల నర్సింహరాజుతో అబార్షన్ చేయించేందుకు ఒప్పందం చేసుకొని మెడికల్ ఆఫీసర్ సలహాతో నర్సు బానోతు అంజలి,ఆయా దుర్గ సహాయంతో అబార్షన్ చేసినట్లు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా అశోక్‌ను విచారించగా టేకుమట్ల ఆర్‌ఎంపీ ధరావత్ దస్తగిరి,జాల జానయ్య,పిన్నాయిపాలెం ఆర్‌ఎంపీ గుగులోతు నాగు,ప్రవీణ్,ప్రశాంత్, గణష్‌లు లింగనిర్థారణ కోసం తమ వద్దకు గర్భిణీలను తీసుకొస్తారని ఒప్పుకున్నట్లు చెప్పారు.నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.