తినుబండారాల కంపెనీకి పట్టణంలో పర్మిషన్ ఎవరిచ్చారు?

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని స్నేహ నగర్ లో జనావాసాల నడుమ ఏర్పాటు చేసిన తిను బండారాల కర్మాగారానికీ పర్మిషన్ ఎవరిచ్చారు కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ కంపెనీ నుండి వెలువడే పొగ,వాసనతో కాలనీ వాసులకు ప్రాణ సంకటంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Who Gave The Permission To The Eatery Company In The Town , Eatery Company, Perm-TeluguStop.com

ఓ బేకరీ వారు ఇల్లు అద్దెకు తీసుకుని వారం రోజుల క్రితంతిను బండారాల కర్మాగారం ఏర్పాటు చేశారని,నిత్యం పొయ్యిలో వంటలు చేస్తుండడంతో వాసన, పొగ కాలనీని కమ్మేసి చిన్నపిల్లలు,వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతూ అనారోగ్యసమస్యలు ఎదుర్కొంటున్నామని, జనావాసాల నుంచి అట్టి కర్మగారాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు కూడా లేకపోవడంతో భయం భయంగా బతకాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

అసలు జనావాసాల నడుమ ఇలాంటి తినుబండారాల కార్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు బేకరీ ఆహార పదార్థాల తయారీపై, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులపై,వారికున్న అనుమతులపై విచారణ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube