భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న పంటలు

నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయక వేసవి పంటలు ఎండి పోతుండడంతో రైతులు తమ పంటల్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.వేసిన పంటలు కాపాడుకునే ప్రయత్నంలో అప్పులు చేసి విచ్చలవిడిగా బోర్లు వేస్తూ,బావులు తవ్విస్తూ నీళ్ళు పడక ఆర్ధికంగా కృంగిపోతున్నారు.

 Crops Drying Up Due To Groundwater Depletion , Groundwater Depletion, Gurrampodu-TeluguStop.com

రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం సాగర్ ఎడమ కాలువ ద్వారా చెరువులు నింపే ప్రయత్నం చేసినా కాలువ ముందు ఉన్న రైతులు ఆ నీటిని చెరువుల్లోకి వెళ్లనివ్వకుండా అధికారులతో కుమ్మక్కై తమ పంటపొలాలకు మళ్లించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.అధికారులు మామూళ్ల మత్తు వీడి సాగర్ నీటిని చెరువులు నింపే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు.

మూడు బోర్లు వేసిన నీళ్ళు పడలేదని కొప్పోల్ గ్రామానికి చెందిన ఐతరాజు రమేష్( Aitaraja Ramesh ) అనే రైతు వాపోతున్నాడు.రెండు ఎకరాల పొలం నాటు పెట్టానని,నాకున్న ఒక్కగాను ఒక్క బోరు అడుగంటిందని, దీంతో ఎండుతున్న పొలాన్ని చూసి ఆగలేక బోరు వేస్తే నీళ్ళు పడలేదని,దీంతో మళ్ళీ వారం ఆగి అప్పుచేసి మరో రెండు బోర్లు వేసినా నీళ్ళు పడలేదని, ఇక చేసేదేమీ లేక కూలి పనికి వెళ్తున్నానని,ఎండాకాలం కాలువ నీటి ద్వారా చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube