భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న పంటలు

నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయక వేసవి పంటలు ఎండి పోతుండడంతో రైతులు తమ పంటల్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.

వేసిన పంటలు కాపాడుకునే ప్రయత్నంలో అప్పులు చేసి విచ్చలవిడిగా బోర్లు వేస్తూ,బావులు తవ్విస్తూ నీళ్ళు పడక ఆర్ధికంగా కృంగిపోతున్నారు.

రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం సాగర్ ఎడమ కాలువ ద్వారా చెరువులు నింపే ప్రయత్నం చేసినా కాలువ ముందు ఉన్న రైతులు ఆ నీటిని చెరువుల్లోకి వెళ్లనివ్వకుండా అధికారులతో కుమ్మక్కై తమ పంటపొలాలకు మళ్లించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

అధికారులు మామూళ్ల మత్తు వీడి సాగర్ నీటిని చెరువులు నింపే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు.

మూడు బోర్లు వేసిన నీళ్ళు పడలేదని కొప్పోల్ గ్రామానికి చెందిన ఐతరాజు రమేష్( Aitaraja Ramesh ) అనే రైతు వాపోతున్నాడు.

రెండు ఎకరాల పొలం నాటు పెట్టానని,నాకున్న ఒక్కగాను ఒక్క బోరు అడుగంటిందని, దీంతో ఎండుతున్న పొలాన్ని చూసి ఆగలేక బోరు వేస్తే నీళ్ళు పడలేదని,దీంతో మళ్ళీ వారం ఆగి అప్పుచేసి మరో రెండు బోర్లు వేసినా నీళ్ళు పడలేదని, ఇక చేసేదేమీ లేక కూలి పనికి వెళ్తున్నానని,ఎండాకాలం కాలువ నీటి ద్వారా చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని కోరుతున్నారు.

చరణ్ అన్న వరల్డ్ బెస్ట్ ఫాదర్… నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్?