BJP: ఏపీలో పొత్తులపై త్వరలో బీజేపీ క్లారిటీ..!

ఏపీలో పొత్తులపై బీజేపీ( bjp ) హైకమాండ్ త్వరలో క్లారిటీ ఇవ్వనుంది.ఈ మేరకు రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ మరియు జనసేన పొత్తులతో పోటీ చేస్తాయా? లేదా ? అన్న వ్యవహారంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.పొత్తులపై రాష్ట్ర నాయకత్వానికి పార్టీ అధిష్టానం క్లారిటీ ఇవ్వనుంది.కాగా ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలతో హైకమాండ్ చర్చలు జరిపిందని తెలుస్తోంది.

 Bjp Clarity On Alliances In Ap Soon-TeluguStop.com

ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) సైతం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) విశాఖ టూర్ ముగిసిన తరువాత ఢిల్లీకి వెళ్లే యోచనలో ఉన్నారని సమాచారం.అలాగే ఏ క్షణమైనా చంద్రబాబుకు ఢిల్లీ( Delhi ) నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది.అయితే రానున్న ఎన్నికలకు మూడు పార్టీలు కలిసి వెళ్తాయా? లేదా? అన్న దానిపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube