అస్మిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

సూర్యాపేట జిల్లా:ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత( Asmita )కుటుంబాన్ని మంగళవారం వారి స్వగ్రామనికి వెళ్ళి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC kavitha ) పరామర్శించారు.అస్మితకు చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబానికి భరోసా ఇచ్చారు.

 A Poem By Mlc Visiting Asmita's Family-TeluguStop.com

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని,ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని తక్షణమే సమీక్ష నిర్వహించాలని కోరారు.ఇప్పటివరకు విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రి లేకపోవడం వలన హాస్టల్ లలో పర్యవేక్షణ లోపం కనిపిస్తున్నదని,ప్రతి హాస్టల్ లో ఫ్రెండ్లి నేచర్ కల్పించాలని,ప్రతి హాస్టల్ లో సైకాలజిస్ట్ లను ఏర్పాటు చేసి విద్యార్థులల్లో మనోధైర్యాన్ని కల్పించాలని, ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునేలా విద్యార్థులను తయారు చేయాలన్నారు.

అస్మిత కుటుంభానికి బీఆర్ఎస్ పార్టీ( BRS party ) అండగా వుంటుందని,తల్లిదండ్రులు కూడా పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెట్టవద్దన్నారు.ఆత్మహత్యలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సమీక్ష నిర్వహించి ఆత్మహత్యల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube