జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం,నవోదయ పాఠశాల మంజూరు చేయాలి

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం సూర్యాపేట జిల్లాకు కేంద్రీయ విద్యాలయం,నవోదయ పాఠశాలను మంజూరు చేయాలని టీపీసీసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా డిమాండ్ చేశారు.బుధవారం హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కేంద్రీయ విద్యాలయాలు మరియు నవోదయ పాఠశాలలు నిరంతర ప్రక్రియ అని పలుమార్లు కేంద్ర మంత్రులు ప్రకటించినా,ఆచరణలో అమలు జరగకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

 The District Should Be Granted A Central University And A Navodaya School-TeluguStop.com

తెలంగాణాలో 33 కొత్త జిల్లాలు అయినందున కేంద్ర ప్రభుత్వ గెజిట్ ప్రకారం ప్రతి జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం మరియు నవోదయ పాఠశాల మంజూరు చేయవలసి ఉండగా, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయటంలేదని ఆరోపించారు.ఇట్టి విషయాన్ని నల్లగొండ పార్లమెంటు సభ్యులుఎన్.

ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేకమార్లు ప్రతిపాదనలు లేఖలు ఇచ్చారని,వారి ప్రతిపాదనలను పరిశీలనలోకి తీసుకుని,కొత్తగా సూర్యాపేట జిల్లా అయినందున విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ జిల్లాకు నవోదయ పాఠశాల మరియు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయాలని కోరారు.ఈ రెండిట్లో ఏదో ఒకటి హుజూర్‌నగర్ కు మంజూరు ఇవ్వాలని,ఈ నియోజకవర్గ ప్రాంతంలో ఎంతో మంది వివిధ హోదాలలో కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన వారు ఉన్నారని మరియు ఇక్కడ ఆసియా ఖండంలోనే రెండవ ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నదని తెలిపారు.

ఇక్కడ ఎంతో మంది బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందక విద్యకు దూరమవుతున్నారని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్టి విషయాన్ని పరిశీలనలోకి తీసుకుని రాష్ట్రానికి రావాల్సిన వాటా ప్రకారం పిల్లలకు నాణ్యమైన విద్య అందించటానికి తక్షణమే కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఒక నవోదయ పాఠశాలను,కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయాలని ఇందులో ఒకటి హుజూర్‌నగర్ ప్రాంతంలో మంజూరు ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు జక్కుల మల్లయ్య,ముశం సత్యనారాయణ,కోల మట్టయ్య,సుబ్బరాజు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube