చరిత్ర మరిచిన రోజు ఇదీ...!

సెప్టెంబర్ 17 విమోచనమా…? విలీనమా…? విద్రోహమా….? అనే విషయంలో అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇది ఖచ్చితంగా ముమ్మాటికి విమోచన దినమేనని అంటున్నారు సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన పరిశోధక విద్యార్థి పెండెం గౌతమ్.చరిత్ర తెలియని వారికి 1948 సెప్టెంబర్ 17వ తేది ప్రాధాన్యం పెద్దగా తెలియక పోవచ్చు.కానీ,తెలిసిన వారికి భావోద్వేగంతో నిండిపోతుంది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో కేసీఆర్ విమోచన ఉత్సవాలను( Telangana Liberation Celebrations ) ఎందుకు నిర్వహించడం లేదంటూ నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలకులను తప్పుపట్టారు.

 Telangana Liberation Celebrations,student Goutham Fires On Cm Kcr Over Telangana-TeluguStop.com

తెలంగాణ వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు.కానీ, తెలంగాణ ఏర్పడి స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా, ఇచ్చిన హామీని నిలుపుకోవడానికి జంకుతున్నాడు.

ఇందుకు కారణం సుస్పష్టం.ఆనాటి రజాకార్ల పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీతో కేసీఅర్ స్నేహబంధం పెట్టుకున్నాడు.

హైదరాబాద్ విమోచన ఉత్సవాలను కేసీఅర్ నిర్వహిస్తే,వారు నోచ్చుకుంటారని భయం.ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) సమైక్యత దినోత్సవంగా నిర్వహించమనడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని వంచించడమే.కేవలం ఓవైసీ ప్రాపకం కోసం మైనార్టీ వర్గాల ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడన్నది అందరికీ తెలిసిన సత్యం.ఓట్ బ్యాంక్ రాజకీయలను పక్కన పెట్టి ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube