వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సిద్ధమైన ఇద్దరు కంటెస్టెంట్లు... ఎవరా ఇద్దరు?

ఇతర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమం ప్రస్తుతం సీజన్ సెవెన్ ప్రసారమవుతు బుల్లితెర ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేస్తుంది.ఇలా ఈ కార్యక్రమం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

 Arjun Ambati And Supritha Enter Into Bigg Boss With Wildcard Entry Details, Bigg-TeluguStop.com

ఇక సీజన్ సెవెన్ కార్యక్రమంలో భాగంగా 14 మంది కంటెస్టెంట్లు పాల్గొనక నేటితో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాబోతున్నారు.దీంతో మరో ఇద్దరు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ఎంట్రీ( Wild Card Entry ) ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

మరి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నటువంటి కంటెస్టెంట్లు ఎవరు అనే విషయానికి వస్తే.

Telugu Arjun, Arjun Ambati, Arjunambati, Bigg Boss, Bigg Boss Ups, Bigg Boss Wil

బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు అర్జున్ అంబటి(Arjun Ambati) అలాగే నటి సురేఖ వాణి (Surekha Vani) కుమార్తె సుప్రీత(Supritha) వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.అర్జున్ పలు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ సందడి చేశారు.అదేవిధంగా పలు డాన్స్ షోలోను అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఈయన మొదట్లో యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో ఈయన ఎలాంటి సీరియల్స్ చేయడం లేదు.దీంతో బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

Telugu Arjun, Arjun Ambati, Arjunambati, Bigg Boss, Bigg Boss Ups, Bigg Boss Wil

ఇకపోతే సురేఖ వాణి ఆర్టిస్టుగా అందరికీ ఎంతో సుపరిచితమే అయితే ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు.ఇక సోషల్ మీడియాలో సుప్రీతకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతుంది అంటూ మొదటి నుంచి కూడా వార్తలు వచ్చినప్పటికీ అది నిజం కాదని తెలిసింది.కానీ వైల్డ్ కార్డు ద్వారా ఈమెను హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

వీరిద్దరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube