తెలంగాణ సాయుధ పోరాటంలో యోధుల త్యాగం మరువలేనిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి( Guntakandla jagadish reddy ) అన్నారు.జిల్లా కేంద్రంలోనికలెక్టరేట్ కార్యాలయంలోనిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలకు( National Unity Day Celebrations ) ముఖ్యాతిధిగా హాజరైన మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం సాయుధ పోరాట యోధులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వామ్య,రాచరికపు వ్యవస్థను రూపుమాపి అమరులైన పోరాట యోధుల వీరత్వాన్ని నేటి సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
చాకలి ఐలమ్మ చైతన్యంతో మొదలై దొడ్డి కొమురయ్య అమరత్వంతో ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచంలోనే తెలంగాణ( Telangana ) పేరును మారుమ్రోగెలా చేసి చరిత్రలో నిలిచిందన్నారు.హైదరాబాద్ సంస్థానం( Hyderabad ) భారతదేశంలో విలీనం కావడంతో తెలంగాణలో రాచరికం ముగిసిపోయి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమైందన్నారు.
హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో అంతర్భాగంగా మారిన ఈ సందర్భాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవడం సముచితమన్నారు.దేశంలో గంగ జమున తేహజీభ్ గా పేరొందిన తెలంగాణలో ఆ సంస్కృతి కొనసాగి తీరుతదన్నారు.1956లో దేశంలో జరిగిన రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా, తెలంగాణ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ-ఆంధ్రను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దశాబ్ద కాలంలోనే తెలంగాణ ఉద్యమం ఎగసి పడిందని,ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చి 2014 జూన్ 2న స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అవలంభించిన ప్రగతిశీల పారదర్శక విధానాల వల్ల సూర్యాపేట జిల్లా అభివృద్ధిలో ముందంజలోఉందన్నారు.సూర్యాపేట జిల్లా ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.