పైసలు లేక పంచాయితీ కార్యదర్శుల పరేషాన్...!

సూర్యాపేట జిల్లా:గ్రామాలలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులకు పరిపాలన బాధ్యతలు అప్పగించారు.ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలో పాలన నిర్వహిస్తున్నారు.

 Paisa Or Panchayat Secretaries Pareshan , Secretaries Pareshan , Panchayat , Atm-TeluguStop.com

అయితే అధికారుల పరిపాలనకు ముందే పంచాయితీ ఖాతాలన్నీ ఖాళీగా ఉన్నాయి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రత్యేక పాలన మొక్కుబడిగా సాగుతుంది.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్)మండలంలో 30 గ్రామ పంచాయతీలు ఉండగా ఫిబ్రవరి నెల నుంచి ప్రత్యేక అధికారుల పాలన షురూ అయింది.దీనితో పంచాయతీల్లో కనీస అవసరాలు తీర్చే బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై పడింది.

నిధుల కొరతతో కార్యదర్శులు రూ.లక్షల్లో అప్పు చేసి ఖర్చు పెట్టారు.ఈ మధ్యనే పంచాయతీ కార్యదర్శులు బదిలీలు కావడంతో ఖర్చు పెట్టిన డబ్బులను ఎలా రాబట్టుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.ప్రతి గ్రామపంచాయతీలో మూడు రకాల ఖాతాలు ఉన్నాయి.

ఒకటి ఆస్తి పన్ను జమ చేసేందుకు ఉపయోగించే ఖాతా.గ్రామాల్లో ఆస్తి పన్ను వసూలు జరుగుతున్నా ఖర్చు మాత్రం నాలుగింతలు ఉండడంతో ఈ ఖాతా ఎప్పుడు ఖాళీ గానే ఉంటుంది.

రెండో ఖాతా ఎస్ఎస్ఎఫ్సిలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు, గ్రాంట్ ను జమ చేస్తారు.రెండేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు.

ఈ రెండు ఖాతాల్లో జమయ్యే నిధుల నుంచి ట్రెజరీ ద్వారా గ్రామ పంచాయతీలు డ్రా చేసుకుంటాయి.మూడో ఖాతా 15వ ఆర్థిక సంఘం నిధులు జమ చేసేందుకు ఉపయోగిస్తారు.

కేంద్ర ప్రభుత్వం నేరుగా ఈ ఖాతాల్లోకి ప్రతి రెండు నెలలకు ఒకసారి నిధులను మంజూరు చేస్తుంది.కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కానీ, రెండు నెలలు నుంచి నిధులు మంజూరు కాలేదు.ప్రత్యేక పాలన నుంచే పంచాయతీ నిధుల కొరత ఉంది.

గ్రామ పంచాయతీ నుంచి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల డబ్బుల కోసం పంచాయతీ కార్యదర్శులు వేచి చూస్తున్నారు.ఎలాంటి కార్యక్రమాలకైనా కార్యదర్శుల జేబులో నుంచి పెట్టుబడి పెడుతున్నారు.

బ్యాంకులలో చెక్కులు కూడా పాస్ కావడం లేదు.ఇలా దాదాపు మేజర్, మైనర్ గ్రామపంచాయతీలలో 2 లక్షల వరకు ఖర్చు పెడుతున్నామంటూ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube