రాజన్న సిరిసిల్ల జిల్లా :గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని వేములవాడ బిజెపి పట్టణ అధ్యక్షుడు డాక్టర్ రాపల్లి శ్రీధర్ అన్నారు.గురువారం గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బిజెపి నాయకులతో కలిసి గాంధీనగర్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మహాత్మా గాంధీ సేవలు మరువలేనివని, అహింసా మార్గంలో స్వాతంత్రోద్యమాన్ని కొనసాగించిన మహనీయుడు అని కొనియాడారు.గాంధీ సిద్ధాంతాలు ముందుకు తీసుకొని వెళ్లాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమం లో బిజెపి సీనియర్ నాయకులు, డాక్టర్ రవీందర్,అడ్వకెట్ రేగుల రాజ్ కుమార్,బిల్లా కృష్ణ,మైలారం శ్రీను,రేణికింది అశోక్,బుర్ర మనీష్సగ్గు రాహుల్,, అన్నం నర్సయ్య మామిండ్ల లక్ష్మిన్ ,గొట్టం వెంకటేష్,బూత్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.