రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి మహాశివరాత్రి జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో వినోద్ తెలిపారు .గురువారం ఉదయం ఆలయ పార్కింగ్ స్థలాన్ని బ్లేడ్ ట్రాక్టర్స్ సహాయంతో చదును చేస్తున్నారు.
ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి గుడిలో మహా శివరాత్రి జాతర అంగ రంగ వైభవం గా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.అధిక భక్తులు రానున్న తరుణంలో అన్ని ఏర్పాట్లు పక్కగా చేస్తున్నారు.
అనునిత్యం ఈవో కె.వినోద్ రెడ్డి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.ఇప్పటికే ఆలయగోపురాలు, గోడలకు పెయింటింగ్స్ పూర్తి కావస్తున్నాయి.సీసీ కెమెరాలు,స్మార్ట్ టీవీలు,త్రాగు నీరు,లైటింగ్ సిస్టమ్స్, క్యూ లైన్లు వద్ద ఫ్యాన్స్ మరమత్తులు చేపిస్తున్నారు.సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.మహాశివరాత్రి జాతర పర్వదినం నేపథ్యంలో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తూ సుందరికరిస్తున్నారు.
ఎలాంటి లోటుపాట్లు లేకుండా.సామాన్య భక్తులకు సైతం శీఘ్రంగా దర్శనమయ్యే విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.
సామాన్య భక్తుల సౌకర్యం క్యూలైన్లలో నూతన ఫ్యాన్స్ సైతం ఏర్పాటు చేస్తున్నారు.







