మహాత్మ గాంధీజీ వర్ధంతి సందర్భంగా మౌనం పాటించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా : జాతిపిత, స్వాతంత్ర్య సమర యోధుడు మహాత్మ గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు.మహాత్మ గాంధీజీ వర్ధంతి సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం స్వాతంత్ర్య సమర యోధులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆయా శాఖల ఉన్నతాధికారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, నివాళి అర్పించారు.
అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం వారు పోరాడిన తీరు, సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో రామ్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.