పాముకాటుతో చిన్నారి మృతి

సూర్యాపేట జిల్లా: అభం శుభం తెలియని చిన్నారి పాపను పాము కాటు వేయడంతో ఆసుపత్రికి తరలించినా ప్రాణం దక్కకపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిన విషాద సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామానికి చెందిన గరిడేపల్లి సతీష్,స్వాతి దంపతులకు ఇద్దరు పాపలు,ఒక పాపను స్కూలుకు పంపించి,మరో పాప మైథిలి(4)ని తీసుకొని తల్లి ఇంట్లో పనికి పోయింది.

 Child Died Of Snakebite, Child Died ,snakebite, Mythili, Garidepalli Sathish, Sw-TeluguStop.com

పాపను ఆడుకోవడానికి కింద వదిలేసి స్వాతి పనులు చేస్తుండగా పాము వచ్చి మైథిలిని కరిచింది.దాంతో ఒక్కసారిగా గట్టిగా అరవడంతో ఏమైందోనని స్వాతి బయటికి వచ్చి చూడగా పాము కాటు వేసిన గాట్లు చూసి ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే మైథిలి మృతి చెందిందని వైద్యులు తెలిపారు.స్థానికులు పామును వెతికి చంపేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube