పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు ఇవాళ కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రులతో పాటు వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు.
మొత్తం ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
మరోవైపు కేంద్రం ప్రత్యేక సమావేశాల అజెండాను అఖిలపక్ష భేటీలో తెలిపింది.ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టిన ది అడ్వొకేట్స్ బిల్లు -2023, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు -2023 తో పాటు ది పోస్టాఫీస్ బిల్లు -2023ను కూడా ఈ సెషన్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే జమిలి ఎన్నికలు వంటి మరికొన్ని అంశాలను కూడా కేంద్రం సభ ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ జోరుగా కొనసాగుతోంది.