క‌రోనా స‌మ‌యంలో దీపావ‌ళి.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పురుడు పోసుకున్న ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్‌.ఎన్ని నెల‌లు గ‌డుస్తున్నా ప్ర‌జ‌ల‌పై దాడి చేస్తూనే ఉంది.

 Tips To Celebrate Deepavali Safely In Corona Time! Simple Tips, Celebrate Deepav-TeluguStop.com

ఈ క‌రోనా పోలేదు.వ్యాక్సిన్ రాలేదు కానీ, దీపావ‌ళి పండ‌గ మాత్రం రానే వ‌చ్చింది.

పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఎంతో ఆనందంగా జ‌రుపుకునే దీపావ‌ళి.ప్ర‌తి ఇంట్లోనూ చీకటిని పారద్రోలి కొత్త కాంతుల‌ను నింపుతుంది.

కేవ‌లం హుందువులే కాదు.అన్ని మ‌తాల వారు దీపావ‌ళి పండ‌గ‌ను ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటారు.
కొత్త బ‌ట్ట‌లు, పిండి వంట‌లు, దీపాల వెలుగులు, టపాసుల చప్పుడ్లు, బొమ్మల కొలువులు ఇలా దీపావ‌ళి పండ‌గ రోజున ఎంతో క‌నువిందు చేస్తుంటాయి.అయితే ఈ ఏడాది క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది.

ఎప్పుడు ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో కూడా ఊహించ‌లేక‌పోతున్నారు.అందుకే క‌రోనా స‌మ‌యంలో దీపావ‌ళి ఆనందంగా జ‌రుపుకోవాలంటే.

ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.

Telugu Corona Time, Coronavirus, Covid, Deepavali, Latest, Simple Tips-Telugu He

దీపావ‌ళి కాబ‌ట్టి.ఖ‌చ్చితంగా ప్ర‌తి ఒక్క‌రూ కొత్త బ‌ట్ట‌లు కొనేందుకో లేదా ఇత‌ర వ‌స్తువుల‌ను కొనేందుకో బ‌ట‌య‌కు వెళ్తుంటారు.ఈ స‌మయంలో మాస్క్‌ను ధ‌రించ‌డం ఎట్టిప‌రిస్థితుల్లోనూ మ‌ర‌వకూడ‌దు.

మ‌రియు బ‌య‌ట‌కు వెళ్లే స‌మ‌యంలో చేతుల‌ను శానిటైజ్ చేసుకుంటూ ఉంటాలి.పండ‌గ క‌నుక బంధువులు, స్నేహితులు వ‌స్తుంటారు.

అయితే వారిని కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్‌ ఇవ్వ‌డం వంటివి అస్స‌ల చేయ‌కండి.దానికంటే రెండు చేతులు జోడించి శుభాకాంక్షలు చెప్ప‌డం చాలా ఉత్త‌మం.

Telugu Corona Time, Coronavirus, Covid, Deepavali, Latest, Simple Tips-Telugu He

దీపావ‌ళి రోజున సాయంత్రం వేళ‌ దీపాలు పెడుతుంటారు.ట‌పాసులు కాలుస్తుంటారు.అయితే ఆ స‌మ‌యంలో శానిటైజర్‌ను వాడ‌కండి మ‌రియు ద‌గ్గ‌ర్లో కూడా ఉంచ‌కండి.ఎందుకంటే, శానిటైజర్లలో ఆల్కహాల్ ఉంటుంది.కాబ‌ట్టి, శానిటైజర్ వాడితే అది పెద్ద మంటకు దారితీస్తుంది.ఇక మీ ఇంట్లో ఎవ‌రైనా శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతుంటే గ‌నుక.

ట‌పాసుల‌ను కాల్చ‌క‌పోవ‌డ‌మే మంచిది.ఎందుకంటే, వాటిని కాల్చ‌డం వ‌ల్ల వ‌చ్చే పొగ శ్వాస సంబంధిత వ్యాధుల‌ను మ‌రింత పెంచుతుంది.

ఇక పండ‌గ కాబ‌ట్టి.చాలా మంది బ‌య‌ట ఫుడ్‌ను ప్రిఫ‌ర్ చేస్తుంటారు.

కానీ, ఇప్పుడు క‌రోనా ఉంది.అది గుర్తుంచుకుని ఇంటి ఫుడ్‌నే తీసుకోవ‌డం మంచిది.

ఫైన‌ల్‌గా.క‌రోనా స‌మ‌యంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఆనందంగా దీపావ‌ళి పండ‌గ‌ను జ‌రుపుకోండి.

హ్యాపీ దీపావ‌ళి!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube