సూర్యాపేట జిల్లా:రోడ్డు విస్తరణ అంటూ అధికారులు,పోలీసులు ఉంటున్న గూడు కూల్చారు, వెళ్లిపోయారు.నిలువ నీడ లేక ఎక్కడ తల దాచుకోవాలో తెలియడం లేదని ఓ బాధిత మహిళ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో గురువారం జరిగిన రోడ్డు విస్తరణ కార్యక్రమంలో ఇల్లు కోల్పోయిన బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.అందరూ గ్రామాభివృద్ధి కోరుకున్నారు.
ఎవరూ రోడ్డు వెడల్పుకి అడ్డుకాదు.కానీ,బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆడిగినం తప్పా? అని ప్రశ్నించారు.ఇక్కడ స్థానిక నాయకుల అసమర్థత వల్ల ఇన్ని సంవత్సరాలు కాలయాపన చేస్తూ ఇల్లు కోల్పోయే బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా అకస్మాత్తుగా ఇండ్లను కూల్చి బాధితులను రోడ్డు మీద పడేసినారని వాపోయారు.స్థానిక నాయకులు ఎటువంటి భరోసా కల్పించకుండా పైగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని,గ్రామ ప్రజలందరూ గమనిస్తున్నారని భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతారని ప్రతిపక్ష పార్టీల నేతలు అంటున్నారు.
రాజకీయాలు ఎలా ఉన్నా తమ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.