ఎన్నికల్లో పీవో,ఏపీవోల బాధ్యతలే కీలకం : కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా: జిల్లాలో శాసన మండలి గ్రాడ్యూయేట్ ఉప ఎన్నికలు -2024 నేపథ్యంలో పీవో,ఏపీవోల బాధ్యతలు కీలకమని కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావ్ అన్నారు.

 The Responsibilities Of Po And Apo Are Crucial In Elections Collector S Venkatra-TeluguStop.com

బుధవారం గ్రాడ్యుయేట్ శాసన మండలి-2024 ఉప ఎన్నికల సందర్బంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీవో,ఏపీవో లకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు అదనపు కలెక్టర్ సి.హెచ్.ప్రియాంక తో కలసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రాడ్యుయేట్ శాసన మండలి ఉప ఎన్నికలు తేదీ:27-5-2024 న ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరుగుతాయని జిల్లాలో 51,497 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని,71 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని,అలాగే పోలింగ్ కొరకు రిజర్వ్ తో కలిపి 85 మంది పీవోలు,85 ఏపీవోలు,170 మంది ఓపీవోలుగా సిబ్బందిని నియమించామని,అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ చేస్తామని తెలిపారు.

ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతాయని,ఈ ఎన్నికలో 52 మంది పోటీ చేస్తున్నందున జంభో బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేశామని,బ్యాలెట్ పేపర్ కూడా పెద్దగా ఉన్నందున ఓటు వేసిన తర్వాత జాగ్రత్తగా మడిచి బ్యాలెట్ బాక్స్ లో వేయాలని,అన్ని కేంద్రాలలో ముందుగానే మౌళిక వసతులు, త్రాగునీరు,ఎలక్ట్రసిటి ఏర్పాటు చేయాలని, పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారి,సిబ్బంది విధులు పూరించవలసిన పత్రాలపై అవగాహన కల్పించుట, పోలింగ్ కేంద్రాలలో ముఖ్యులు సందర్శించినప్పుడు పిఓ డైరీలో తప్పక రాయాలని సూచించారు.ఓటింగ్ కంపార్ట్మెంట్ ని బయటకు కనపడకుండా పోలింగ్ గదిలో వెలుతురున్న చోట ఏర్పాటు చేయాలని,

గ్రాడ్యుయేట్ ఓటర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపించి ఈ ఎన్నికలలో పోలింగ్ అధికారులు ఇచ్చిన పెన్నుతో మాత్రమే బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థి పేరుకి ఎదురుగా ఏర్పాటు చేసిన జోన్ లో ప్రిపరెన్స్ ప్రకారం సీరియల్ గా నెంబర్లు గాని,రోమన్ సంఖ్యలు వేస్తే ఓటు చెల్లుతదని,అక్షరాలు, టిక్కులు,సంతకాలు రాస్తే ఆ ఓటు చెల్లదని తెలిపారు.

అలాగే ఓటు వేసిన తర్వాత ఓటర్ కి ఎడమ చేతి మధ్య వేలుకి ఇండేలీబుల్ ఇంక్ తో పోలింగ్ సిబ్బంది గుర్తు పెట్టాలని,అంధుల ఓటర్లు ఎవరైనా ఉంటే వారి వెంట వచ్చిన సహాయకులతో ఓటు వేయించాలని సూచించారు.కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఓటర్ పేసిలిటేషన్ సెంటర్ ద్వారా పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ తో తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని తెలిపారు.

అనంతరం పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన,పోలింగ్ నిర్వహణ తీరు, పూరించవల్సిన పత్రాలు, తదితర అంశాలపై స్టేట్ మాస్టర్ ట్రైనర్ రమేష్ తో అవగాహన కల్పించారు.ఈ సమావేశంలో ఎంసిసి నోడల్ అధికారి డిఎఫ్ఓ సతీష్ కుమార్,మాన్పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి జెడ్పీ సఈవో అప్పారావు,రిపోర్టింగ్ నోడల్ అధికారి డిఆర్డిఓ మధుసూధనరాజ్,జిల్లా రవాణా అధికారి సురేష్, జిల్లా అబ్కారి శాఖ అధికారి లక్ష్మా నాయక్, ఆర్.డి.ఓ వేణుమాధవ్, ఎలక్షన్ సూపరిటీడెంట్ శ్రీనివాసరాజు,తహసీల్దార్ లు,ఎంపీడీఓలు,పీవోలు, ఏపీవోలు,మాస్టర్ ట్రైనర్స్ రమేష్,శ్రీనివాస్,వెంకటేశ్వర్లు,ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube