పేట వ్యవసాయ మార్కెట్ లో అక్రమ ధాన్యం

సూర్యాపేట జిల్లా:ఓ దళారీ భరోసాతో హుజుర్ నగర్ కి చెందిన మిల్లర్ ధాన్యాన్ని పేట వ్యవసాయ మార్కెట్ కి తరలించినట్లుగా సమాచారం.ఐకెపి సెంటర్ల ద్వారా ప్రభుత్వం ఖరీదు చేసి మిల్లులకు అలాట్మెంట్ చేశారు.

 Illegal Grain In Peta Agricultural Market-TeluguStop.com

సివిల్ సప్లై వారికి మిల్లర్లు బియ్యాన్ని పంపవలసి ఉండగా,మిల్లులో ఉన్న ధాన్యాన్ని బయట మార్కెట్లోకి తరలించి సొమ్ము చేసుకునే ప్రయత్నంలో బియ్యానికి బదులగా రేషన్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి సివిల్ సప్లైకి సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే 8 మంది బినామీ పేర్లతో 3600 ఐకెపి బస్తాల్లో పేట మార్కెట్ కు సాంబమైసూరి ధాన్యం రావడం చర్చనీయాంశంగా మారింది.

అది కూడా మార్కెట్ కి సెలవు దినమైన ఆదివారం,ఉదయం 11 గంటలకు లారీల ద్వారా అక్రమంగా వచ్చినట్లు తెలుస్తోంది.మార్కెట్ సెక్రటరీ ధాన్యంపై ఆరా తీయగా చిలుకూరు మండలం పాలెఅన్నారం గ్రామానికి చెందిన 8మంది రైతులు సామూహిక వ్యవసాయం చేసినట్లు తెలిసిందన్నారు.

విషయం తెలిసి మార్కెట్ కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కమిషన్ దార్ల సంఘం నాయకులు మీకు ఇక్కడ ఏమి పని అంటూ దురుసుగా ప్రవర్తించడం గమనార్హం.ఇదిలా ఉండగా చిలుకూరు మండలం పాలె అన్నారం (నారాయణ పురం) గ్రామానికి చెందిన 8మంది రైతులవేనని స్థానిక ఏవో వాట్సప్ ద్వారా,సర్పంచ్ ఫోన్ ద్వారా ఇచ్చిన సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని మార్కెట్ కమిటీ అధికారులు టెండర్ వేసినట్లు తెలుస్తోంది.

మిల్లర్ ఒత్తిడితో దళారి ప్రస్తుత ధాన్యాన్ని అమ్మేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు తేలవడంతో ధాన్యాన్ని మార్కెట్ అధికారులు సీజ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube