సూర్యాపేట జిల్లా: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఐఐటీ పరీక్ష, కంప్యూటర్, పాఠ్యపుస్తకాల పేరుతో దోపిడీ చేస్తున్న నాగారం మండలం ఫణిగిరిలోని మేరీ మదర్ ఆఫ్ హోప్ హైస్కూల్ ను సీజ్ చేయాలిని పి.డి.
ఎస్.యు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోలేబోయిన కిరణ్ డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కేంద్రంలోని విద్యా శాఖ కార్యాలయంలో పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో ఏడీకి వినతిపత్రం అందజేశారు.ఆనంతరం ఆయన మాట్లాడతూ అడ్మిషన్ ఫీజు,ఎగ్జామ్స్ ఫీజు, పాఠ్యపుస్తకాల పేర్లతో వేలాది రూపాయలను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తూ,విద్యా దోపిడీకి పాల్పడుతున్నా విద్యా శాఖ అధికారులు పట్టించుకోక పోవడం ఏమిటని ప్రశ్నించారు.ఫీజుల పేరుతో స్కూల్ విద్యార్థులను బయట నిలబెట్టి అందరి ముందు అవమానపరుస్తూ విద్యార్థుల మనోభావాలు దెబ్బ తినేవిధంగా వ్యవహరిస్తున్న మేరీ మదర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని,పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చెప్పడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా నాయకులు పిడమర్తి భరత్,కేశబోయిన వంశీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.