తెనాలిలో రైతు భరోసా-పిఎం కిసాన్ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఉందా అంటూ చంద్రబాబుకి.
పవన్ కళ్యాణ్ కి సవాల్ విసిరారు.దీంతో సీఎం జగన్ చేసిన కామెంట్లకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.అసలు మీతో ఏ పార్టీ అయినా కలుస్తుందా అంటూ సెటైర్లు వేశారు.175 స్థానాలలో కనీసం ఒక్క స్థానంలో నైనా… మీతో కలిసి నడిచే పార్టీ ఏదైనా ఉందా అంటూ ఎద్దేవా చేశారు.
“ఆర్థిక నేరస్థుడు జగన్ తో ఎవరు పొత్తు పెట్టుకుంటారు.? పాలనాధికారం ఇచ్చిన ప్రజలనే మోసగించిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు.ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయటం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.1983 నుంచి పలు ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీ చేసినట్లు గుర్తు చేశారు.నియంత అరాచక వాది కాబట్టే జగన్ తో కలిసి పని చేయడానికి ఏ పార్టీ ముందుకు రావడం లేదని… టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్లు ఇచ్చారు.