సూర్యాపేట జిల్లా:గత అరవై సంవత్సరాలు నుండి ఒకటే సొసైటీగా వున్న సూర్యాపేట, పిల్లలమర్రి,రాయనిగూడెం,కెటి అన్నారం మత్స్య పారిశ్రామిక సొసైటీని విడగొట్టి పిల్లలమర్రి సొసైటీని ప్రత్యేక సొసైటీగా గుర్తిస్తూ జిల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారి ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని మత్స్య శాఖ కార్యాలయం వద్ద సూర్యాపేట, రాయనిగూడెంకు చెందిన వందలాదిమంది మత్స్య కార్మికులు,ముదిరాజ్ లు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సూర్యాపేట మత్స్య పారిశ్రామిక సంఘం నాయకులు మాట్లాడుతూ ఇంతకాలం ఉమ్మడిగా కొనసాగిన సూర్యాపేట సొసైటీని మత్స్య శాఖ అధికారులు ఎవ్వరికి చెప్పకుండా,ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా చాటుమాటున పిల్లలమర్రి సొసైటీని ఏర్పాటు చేశారని ఆరోపించారు.
ఈ విషయం సూర్యాపేట సొసైటీ కార్యవర్గ సభ్యులకు చెప్పకుండా చేశారని అన్నారు.రాయనిగూడెం గ్రామంలో దాదాపుగా 300 మంది చేపల చెరువు మీద ఆదారపడి జీవిస్తున్నారని, వీరి ప్రధాన వృత్తి చేపలు పట్టి జీవించడమని,కానీ, అధికారులు తీసుకున్న నిర్ణయాల మూలంగా వందలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని అన్నారు.
అనంతరం జిల్లా అధికారులు తెచ్చిన జివోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డి.ఎఫ్.ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి,డిఎఫ్ఓ రూపేందర్ సింగ్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట మత్స్య పారిశ్రామిక అధ్యక్షులు సారగండ్ల కోటయ్య, ఉపాధ్యక్షులు నల్లమేకల వెంకన్న,ప్రధాన కార్యదర్శి నందనబోయిన నాగరాజు, కోశాధికారి ఇండ్ల సురేష్, డైరెక్టర్లు కోల నిరంజన్, మోర జానకిరాములు, నల్లమేకల అంజయ్య, మారిపెద్ది ముత్తమ్మ,ఇండ్ల లక్ష్మమ్మ,రాయనిగూడెం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మునక ఎల్లయ్య,మంత్రి వెంకన్న, నల్లమేకల నాగయ్య, నల్లమేకల సైదులు, రావుల వీరశేఖర్, సందరబోయిన శంకర్, నల్లమేకల లచ్చయ్య, మంత్రి జానయ్య,మేకల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.