ప్రస్తుత చలికాలంలో సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో జలుబు ఒకటి.పిల్లలు పెద్దలు అనే తేడా లేదు దాదాపు అందర్నీ జలుబు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
జలుబు కారణంగా శ్వాస తీసుకోవడంలో సైతం ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఈ క్రమంలోనే జలుబు నుంచి బయట పడటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను తీసుకుంటే కనుక కేవలం రెండు రోజుల్లోనే జలుబు పరార్ అవుతుంది.ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో.
దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న సైజ్ ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే అంగుళం అల్లం ముక్కను తీసుకుని పొట్టు తొలగించి వాటర్ లో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇక మూడు వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకుని పొట్టు తొలగించి మెత్తగా దంచుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
అనంతరం స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ను మిక్స్ చేసి సేవించాలి.

రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను తీసుకుంటే కనుక రెండు రోజుల్లోనే జలుబు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.దగ్గు సమస్య ఉంటే పరార్ అవుతుంది.మరియు శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే దూరం అవుతాయి.
కాబట్టి జలుబు సమస్యతో సతమతం అవుతున్న వారు తప్పకుండా పైన చెప్పిన డ్రింక్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.