బిగ్ బాస్ సీజన్ 6 మూడవ వారంలోకి అడుగు పెట్టింది.ఈ సీజన్ లో మొదటి వారం నుంచి చాలా కూల్ గా మంచోడు అనిపించుకున్న వ్యక్తి ఒక్కడే అతనే బాలాదిత్య.
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అతను నటిస్తూ వచ్చాడు.హీరోగా కూడా సినిమాలు చేశాడు.
సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులని మెప్పించాడు.అయితే హౌజ్ లో ఎలాంటి విషయానికైనా సరే కూల్ గా రెస్పాండ్ అవుతున్నాడు బాలాదిత్య.
మొన్న వీకెండ్ నాగార్జున కూడా అతని మంచితనం గురించి ప్రస్థావించి ఇదంతా నిజమేనా అని అన్నారు.

అయితే బాలాదిత్య వర్షన్ ఏంటంటే తను పర్సనల్ గా తెలిసిన వారికి తన గురించి అర్ధమవుతుందని అంటున్నాడు.హౌజ్ లో తాను ఉంటున్నది సేఫ్ గేమ్ అని అందరు అంటున్నారు.కానీ తన ప్రవర్తన.తన ఆలోచన ఎప్పుడూ ఇంతే అని చెబుతున్నాడు.3వ వారం జరిగిన నామినేషన్స్ లో కూడా బాలాదిత్యకి నామినేషన్స్ వేస్తూ మంచితనం ముసుగులో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్నట్టుగా హౌజ్ మెట్స్ నామినేట్ వేశారు.మరి ఈ మంచితనం అనేది బాలాదిత్యకి ప్లస్ అవుతుందా లేదా అన్నది చూడాలి.