సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికే ముందుగా ఇల్లులు ఇస్తామని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ ముందు ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు ఇచ్చిన తరువాతనే మన పార్టీ అయినా,ఏ పార్టీ వాళ్లకైనా ఇల్లు ఇస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక్కొక్క నియోజకవర్గంలో 3000 ఇండ్లు ఇచ్చారని,ఈ పాటికే మన నియోజకవర్గానికి కూడా రావాల్సి ఉండే కొంచెం ఆలస్యం అయ్యిందని,త్వరలో దాదాపు 3000 ఇండ్లు వస్తాయని,అవి రాగానే వాటిల్లో ఇల్లు నష్టపోయిన వాళ్ళకు ముందుగా 3 లక్షల రూపాయల ఇండ్ల సర్టిఫికెట్ లు అందజేస్తామని అన్నారు.పట్టణ అభివృద్ధిలో భాగంగా,రోడ్డు విస్తరణలో ఇల్లు నష్టపోయిన వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,వాళ్ళకు న్యాయం చేస్తామని,100 కు 100% శాతం ఇండ్లు ఇప్పించే బాధ్యత నాదని భరోసా ఇచ్చారు.