సూర్యాపేట జిల్లా:ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే ఉత్సవాల్లో భాగంగా ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరైన ఐఎన్టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాముల శివారెడ్డి,డిసిసిబి డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు,మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డిలతో కలసి ఐఎన్టీయూసీ అనుబంధ సంఘాలైన ఆటో వర్కర్స్ యూనియన్,రైస్ మిల్ డ్రైవర్స్ యూనియన్,బిల్లింగ్ వర్కర్స్ యూనియన్,హమాలి వర్కర్స్ యూనియన్,సివిల్ సప్లై వర్కర్స్ యూనియన్,మున్సిపల్ వర్కర్స్ యూనియన్,తదితర సంఘాల జెండాలను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి,సామ్యవాద జీవన సాధనలో కదలిరండి అని,కార్మిక చట్టాలు సంఘటిత ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.నిత్యవసర ధరలు మరియు డీజిల్ పెట్రోల్ ధరల పెరుగుదల వలన కార్మికులు,అసంఘటిత కార్మికులు,పేద ప్రజల జీవితాలు అంధకారంలో ఉన్నాయని అందుకే మరొక కార్మిక హక్కుల సాధన ఉద్యమం నడపాలని మేడే సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,బెల్లంకొండ గురవయ్య, కర్ణాకర్రెడ్డి,సలిగంటి జానయ్య,మేళ్లచెరువు ముక్కంటి, పాశం రామరాజు,చింతకాయల రాము,పోతబోయిన రామ్మూర్తి,సావిత్రి,బెంజిమెన్,చంద్రశేఖర్,వేముల నాగరాజు,వెంకటేశ్వర్లు,మేకపోతుల వీరబాబు,ఎస్కే హుస్సేన్,రవీందర్, ప్రసాద్,రాము,తోట లక్ష్మయ్య, ఎడవెల్లి వీరబాబు,భిక్షం,గడ్డం నాగయ్య,సుమతి, నరసింహారావు,సైదులు,మాసూం అలీ,జానీమియా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.