కోదాడ పట్టణాభివృద్దే లక్ష్యంగా ముందుకు పోతాం: కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణాభివృద్దే లక్ష్యంగా ముందుకుపోతామని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పలువార్డుల్లో డ్రైనేజీ,సీసీ రోడ్లు మరియు కోదాడ ముఖ ద్వారం నిర్మాణానికి రూ.56 కోట్లతో శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ… గత ప్రభుత్వం కోదాడ పట్టణంలో అభివృద్ధి చేయకుండా దోచుకుతినడంలో ముందంజలో ఉందని విమర్శించారు.

 We Will Move Ahead With The Goal Of Kodada Urban Development Kodada Mla Uttam Pa-TeluguStop.com

ఏ వార్డులో చూసినా అధ్వాన్నంగా ఉందని,గతపదేళ్లలో చేసిన అభివృద్ధి ఏదని ప్రశ్నించారు.ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేరుగా నన్నే అడగండని,అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం కోదాడ అభివృద్ధి పనుల కొరకు రూ.56 కోట్లు మంజూరు చేయడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు కోదాడ పట్టణవాసులు, కార్యకర్తలు,అభిమానులు, వార్డు నెంబర్లు, అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube