సర్పంచ్ ల రక్తం పీలుస్తున్న టీఆర్ఎస్:ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచ్ లకు అధికార,ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులకు గౌరవం లేకుండా పోయినదని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు,నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.సోమవారం హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సూర్యపేట జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లు,ప్రజా ప్రతినిధులు తో తెరాస ప్రభుత్వం నుండి వారు ఎదురుకుంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.

 Trs Drinking The Blood Of Sarpanchs: Uttam-TeluguStop.com

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్పంచ్ లను,ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ లు ప్రజా ప్రతినిధులు సరైన నిధులు విధులు లేక అడుగు అడుగున అవమానాలు భరిస్తూ బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా అధికార ప్రతి పక్ష సర్పంచ్ ల రక్తాన్ని పీలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్లె ప్రగతిలో పనులు చేసినా నెలల తరబడి బిల్లులురాక లక్షలాది రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని దీంతో సర్పంచులు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని,తెచ్చిన డబ్బులకు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.సర్పంచ్ లను ప్రజాప్రతినిధులను అవమానిస్తున్న తెరాస ప్రభుత్వం కుప్పకూలి పోవడం ఖాయమని అన్నారు.

హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి నియోజకవర్గంలో ఉన్న సర్పంచ్ ల తీర్మానం లేకుండానే ఎల్ఈడి లైట్లు,పంచాయతీ ట్రాక్టర్లు లోచివరికి బ్లీచింగ్ ఫౌడర్ కొనుగోలు లో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇస్తున్ననని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని గ్రామాల్లో 12 గంటలు కూడా కరెంటు రావడం లేదన్నారు.

గ్రామాల్లో వైకుంఠ దామాలు నిర్మించారని వాటికి బిల్లులు చెల్లించక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారన్నారు వైకుంఠ దామాలలో మీటర్లు పెట్టి ఒక్క బ్లబ్,ఒక్క ఫ్యాన్ కె 1500 రూపాయల వరకు కరెంటు బిల్లులు వస్తున్నాయని గ్రామ పంచాయతీలు ఆ బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్నాయని ప్రభుత్వమే ఆ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున్ రావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశముఖ్,రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి,ఎం.

పి.పి గోపాల్, జెడ్పీటీసీ మోతీలాల్,మంజునాయక్,కోనతం చిన్న వెంకటరెడ్డి,కాంగ్రెస్ సర్పంచ్ లు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube