అన్నదాతలను అడ్డంగా దోచుకుంటున్న వే బ్రిడ్జి

సూర్యాపేట జిల్లా:అన్నదాత ఇంటీల్లిపాది ఆరుగాలం శ్రమించి,స్వేదం చిందించి పండించిన పంటను అడుగడుగనా దోచుకోవడం ఆనవాయితీగా వస్తోంది.దేశానికి అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టడంలో దళారులు ఆరితేరిపోయారు.

ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ప్రతిసారీ మోసపోతున్న అన్నదాతలను,మధ్య దళారులు,మిల్లర్లు తమకు ఇష్టమొచ్చినట్లుగా దోపిడీ చేస్తున్నారు.అది చాలదన్నట్లుగా ఇప్పుడు మరో కొత్తరకం మోసానికి రైతులు బలైతున్న సంఘటన సూర్యాపేట జిల్లాలో మంగళవారం రాత్రి వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల మండల కేంద్రంలో ధాన్యం కాంటా వేసే రాఘవేంద్ర వే బ్రిడ్జి యాజమాన్యం భారీ మోసానికి తెరలేపింది.తమ వే బ్రిడ్జిలో కాంటా కోసం వచ్చే ధాన్యం ట్రాక్టర్ల కాంటా వేసే సమయంలో ఒక్కొక్క ట్రాక్టర్ లోడు నుండి 10 క్వింటాల ధాన్యం తరుగుతో వచ్చేలా పక్కా ప్లాన్ చేశారు.

అనుమానం వచ్చిన రైతులు మరోసారి కాంటా వేయాలని డిమాండ్ చేయడంతో మళ్ళీ 10 క్వింటాల్ తరుగు రావడంతో వే బ్రిడ్జి మోసాన్ని పసిగట్టిన రైతన్నలు పోలీసులకు సమాచారం అందించారు.అక్కడికి చేరుకున్న నేరెడుచర్ల ఎస్ఐ నవీన్ కుమార్ మళ్ళీ కాంటా వేయాలని చెప్పడంతో వైర్లు కదలడం వల్ల పొరపాటు జరిగి ఉండొచ్చని చెప్పడంతో వే బ్రిడ్జి నిర్వాహకులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మళ్ళీ ధాన్యం కాంటా పెట్టడంతో అప్పుడు కూడా 10 క్వింటాల్ ధాన్యం తరుగు రావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని హుజూర్ నగర్ మిర్యాలగూడ జాతీయ రహదారి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.దీనితో రహదారిపై వాహనాలు భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లడుతూ కొంతమంది మిల్లర్లు వే బ్రిడ్జి తూకాల్లో మోసం చేస్తున్నారని, రైతుల రక్తాన్ని ఎక్కడిక్కడ జలగల్లా పీల్చి పిప్పిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్ని కష్టాలు పడితే పంట ఇక్కడికి వచ్చిందో మాకు మాత్రమే తెలుసని,మా కష్టాన్ని నిలువు దోపిడి చేస్తూ పందికొక్కుల్లా బలుస్తున్నారని మండిపడ్డారు.

మిల్లర్లు ఇష్టారాజ్యంగా దోపిడి చేస్తున్నా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం విస్మయానికి గురిచేస్తోందన్నారు.అధికారులు సరైన చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతోనే మిల్లర్లు ఆగడాలు శ్రుతి మించిపోతున్నాయని,ఈ విషయంలో మిల్లర్లకు, అధికారులకు చీకటి ఒప్పందం ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.

ఈ సీజన్ లో ఇప్పటికే వేల క్వింటాల ధాన్యం ఈ వేబ్రిడ్జిలో కాంటా వేసి ఉంటారని,ఆ చొప్పున ఎన్ని వందల క్వింటాల్ ధాన్యం కొల్లగొట్టి ఉంటారని అవేదన వ్యక్తం చేశారు.ఈ వే బ్రిడ్జి ద్వారా కాంటా అయిన రైతులందరికీ ట్రాక్టర్ కి 10 క్వింటాల్ లెక్క నష్టపరిహారం చెల్లించాలని,ఈ వే బ్రిడ్జి యాజమాన్యంపై,సంబధిత మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube