YouTube Shorts TV : టీవీ చూసే వారికి యూట్యూబ్ గుడ్ న్యూస్.. షార్ట్స్ వీక్షణలో సరికొత్త అనుభూతి

తక్కువ నిడివితో ఉండే వీడియోలతో టిక్ టాక్ యాప్ బాగా ఫేమస్ అయింది.ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లను సంపాదించింది.

 Watch Youtube Shorts On Smart Android Tv, Youtube, Youtube Shorts, Youtube,socia-TeluguStop.com

దీంతో తక్కువ నిడివితో కూడిన వీడియోలపై యూట్యూబ్ కూడా దృష్టి సారించింది.ఈ క్రమంలోనే యూజర్లకు సరికొత్త అనుభూతిని పంచుతూ యూట్యూబ్ షార్ట్స్ తీసుకొచ్చింది.

టిక్‌టాక్‌పై పలు దేశాల్లో నిషేధంతో యూబ్యూబ్ షార్ట్స్‌కు మరింత ఆదరణ పెరిగింది.సృజనాత్మకతతో ఎందరో తీసే యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు యూజర్లను అలరిస్తున్నాయి.

ఫోన్‌ ద్వారా వీక్షిస్తున్న అనుభూతి టీవీలలో చూసినప్పుడు ఉండడం లేదు.ఫోన్‌లో నిలువుగా ఉండే వీడియోలు ఉంటాయి.

వాటిని టీవీలలో చూసినప్పుడు కూడా వీక్షకులకు అదే అనుభూతిని పంచేలా యూట్యూబ్ సరికొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Telugu Smart Tv, Youtube, Youtube Ups-Latest News - Telugu

ఇక నుంచి యూట్యూబ్ షార్ట్స్ వీడియోలను టీవీలలో కూడా చక్కగా వీక్షించవచ్చు.ఇందు కోసం అప్‌డేట్‌లను తీసుకొచ్చినట్లు యూట్యూబ్ తాజాగా వెల్లడించింది.టీవీలో YouTube Shorts చూసే వారి కోసం గ్లోబల్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.YouTube స్మార్ట్ టీవీ యాప్‌తో మీరు టీవీలో కూడా నిలువుగా ఉండే తక్కువ నిడివి కలిగిన వీడియోలను చూడొచ్చు.

మొబైల్ యాప్‌లో 60 సెకన్ల వీడియోలను మాత్రమే చూసే అవకాశం ఉంది.YouTube TV కోసం YouTube Shortsని కంపెనీ ఆప్టిమైజ్ చేసింది.యూజర్లు సౌకర్యవంతంగా నిలువుగా ఉండే వీడియోలను చూసేందుకు వీలుగా యాప్ కుడివైపున ప్రత్యేకంగా డిజైన్ చేశామని యూట్యూబ్ ఒక ప్రకటనలో తెలిపింది.కొత్త అప్‌డేట్ తర్వాత టీవీలో చూసిన అనుభవం అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

ఈ సరికొత్త అప్‌డేట్ మరికొన్ని వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రానుందని యూట్యూబ్ తెలిపింది.మీరు మీ టీవీ రిమోట్‌తో YouTube Shorts వీడియోలను ప్రారంభించవచ్చు.

ఆపివేయవచ్చు .అంతేకాకుండా ప్లే-పాజ్(తాత్కాలికంగా నిలుపుదల) చేయవచ్చు.ప్రస్తుతం YouTube Shorts రోజువారీ వీక్షణల సంఖ్య 30 బిలియన్ల మార్క్‌ను అధిగమించింది.సేవలను మరింత విస్తృతం చేస్తూ టీవీలలో కూడా సరికొత్త అనుభూతిని పంచుతూ అప్‌డేట్‌లను యూట్యూబ్ తీసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube