Samantha : ఒంటరి జీవితమే సమంతకు శాపమైందా.. జాతకం వల్లే ఇలాంటి కష్టాలా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే.ఈ వ్యాధి వల్ల నడవటం కూడా కష్టమవుతోందని సమంత పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

 Astrologer Predicts On Samantha Health Issues,samantha,myositis,naga Chaitanya,-TeluguStop.com

అయితే ప్రస్తుతం సమంత ఒంటరిగా జీవనం సాగిస్తున్నారని అదే సమంతకు శాపమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.విడాకులు తీసుకోకుండా ఉండి ఉంటే సమంతకు అక్కినేని కుటుంబం సపోర్ట్ లభించి ఉండేది.

సమంత ఆరోగ్య స్థితి గురించి చైతన్యకు స్పందించాలని ఉన్నా స్పందించడం వల్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉందని చైతన్య భావిస్తున్నట్టు తెలుస్తోంది.తాను స్పందించి సమంత నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోయినా నష్టపోయేది తానేనని ఆయన భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

మరోవైపు సమంత జాతకంలో కూడా దోషాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన హరి శాస్త్రి సమంత జాతకం గురించి మాట్లాడుతూ ఆమె జాతకం ప్రకారం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయని అన్నారు.

వృత్తిపరంగా మాత్రం ఆమె జాతకం బాగుందని పేర్కొన్నారు.సమంత వ్యక్తిగత జాతకంలో శని సంచారం ఉందని జాతకం ప్రకారం అభిప్రాయ భేదాల వల్లే విడిపోయారని పేర్కొన్నారు.

సమంత చైతన్య ఇప్పట్లో కలిసే అవకాశాలు లేవ్ని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Akkineni, Astrology, Divorce, Myositis, Naga Chaitanya, Samantha-Movie

చైతన్య జాతకం ప్రకారం ఆయనకు ఎమోషనల్ లెవెల్స్ ఎక్కువని మాట పట్టింపులకు ప్రాధాన్యత ఇస్తాడని ఆయన కామెంట్లు చేశారు.చైతన్య సమంత విడిపోయినా వాళ్లు శత్రువులలా అయితే ఉండరని ఆయన చెప్పుకొచ్చారు.హరిశాస్త్రి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమంత అటు వృత్తిపరంగా ఇటు కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే సమంత కెరీర్ లో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube