ప్రస్తుత సమాజంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలలో ఒత్తిడి అనేది ఎక్కువగా పెరిగిపోతుంది.దీనివల్ల అప్పుడప్పుడు కొంతమంది ప్రజలు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
ఒక్కోసారి మరి కొంతమంది సహనాన్ని కోల్పోయి రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు.ఇలా సహనాన్ని కోల్పోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వ్యక్తుల వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి రోజు షేర్ అవుతూనే ఉంటాయి.
తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తను ప్రయాణించాల్సిన ఫ్లైట్ మిస్ అవ్వడంతో విసుగు చెందిన ఒక మహిళ తన తోటి ప్రయాణికుల తో దురుసుగా ప్రవర్తించింది.
అంతే కాదు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై హింసాత్మకంగా ప్రవర్తించింది.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తోటి ప్రయాణికులపై సూట్‌కేస్ విసిరి కొట్టడం వీడియోలో చూడొచ్చు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ మెక్సికో సిటీ ఎయిర్‌లైన్ చెక్-ఇన్ డెస్క్,సిబ్బందిపై దాడి చేయడాన్ని వీడియోలో చూడవచ్చు.10 సెకనులు ఉన్న ఈ వీడియోలో కోపంతో ఉన్న మహిళ అరవడం, వస్తువులు విసరడం, కంప్యూటర్‌ని ధ్వంసం చేయడం వంటి పనులు చేస్తూ అక్కడ ఉన్న ప్రయాణికులతో ఎయిర్లైన్స్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది.
అయితే ఈ మహిళా విమానాశ్రయానికి ఆలస్యంగా రావడమే కాకుండా గడువు ముగిసిన పాస్‌పోర్ట్ తో చెక్ ఇన్ చేయడానికి ప్రయత్నించింది.
ఈ రెండు కారణాల వల్ల ఆమె ప్రయాణం క్యాన్సిల్ అయింది.దాని తో అప్పటి వరకు ప్రశాంతం గా ఉన్న మహిళ ఒక్క సారిగా కోపంతో సిబ్బంది తో గొడవకు దిగింది.
దీని తర్వాత పరిస్థితిని అదుపు చేయడానికి అక్కడికి పోలీసులు భద్రత సిబ్బంది వచ్చారు.ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ అవుతుంది.







