ఓటీటీకి ఆదరణ నానాటికీ పెరుగుతోంది.థియేటర్లలో విడుదలైన సినిమాలు అతి తక్కువ కాలంలోనే ఓటీటీలలోకి వచ్చేస్తున్నాయి.
క్రైమ్, థ్రిల్లర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ ఇలా విభిన్న రకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ యాప్‌ల ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి.ఈ తరుణంలో ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉన్న అమెజాన్ ప్రైమ్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది.
అమెజాన్ ప్రైమ్ అతి తక్కువ ధరతో కొత్త వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది.ఈ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ రూ.599 ధరతో పొందొచ్చు.అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మొబైల్ వెర్షన్ కోసం ప్రారంభించబడింది.
అమెజాన్ ప్రైమ్ భారతదేశంలో తన ప్లాట్‌ఫారమ్ వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది.నెట్‌ఫ్లిక్స్, వూట్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ఇతర స్ట్రీమింగ్ సేవలతో పోటీ పడుతోంది.

అమెజాన్ ప్రైమ్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూ.1499గా ఉంది.ధర కొంచెం ఎక్కువగా ఉండడంతో యూజర్లు తగ్గిపోయే అవకాశాన్ని సంస్థ గమనించింది.దీనికి పరిష్కారంగా అమెజాన్ ప్రైమ్ తీసుకొచ్చిన రూ.599 మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడొచ్చు.ఈ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌తో టీవీలు, ల్యాప్‌టాప్‌లలో ప్రైమ్ వీడియోలను చూడలేరు.
ఈ ప్లాన్‌తో, కొత్త సినిమాలు, అమెజాన్ ఒరిజినల్స్, లైవ్ క్రికెట్ వంటి అమెజాన్ ప్రైమ్‌లోని మొత్తం కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు.అదే సమయంలో యూజర్లు సింగిల్ స్క్రీన్‌కే అనుమతి ఉంటుంది.
అంటే యూజర్లు ఒకేసారి ఒక ఫోన్‌లో మాత్రమే అమెజాన్ ప్రైమ్‌కు లాగిన్ చేయగలరు.కొత్త ప్లాన్‌తో సైన్ అప్ చేయడానికి, వినియోగదారులు Prime Video యాప్ (Android) లేదా వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు.
ప్రైమ్ వీడియో మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో, కస్టమర్‌లు స్టాండర్డ్ డెఫినిషన్‌లో అంటే SD నాణ్యతలో వీడియో స్ట్రీమింగ్ సౌలభ్యాన్ని పొందుతారు.కస్టమర్‌లు 480p నాణ్యత గల వీడియోలను మాత్రమే చూడగలరు.
అదే సమయంలో, ఈ ప్లాన్‌తో, కస్టమర్‌లు ప్రకటనలను కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది.







