సూర్యాపేట జిల్లా:గుర్రంపోడు భూములకు సంబంధించిన ఘటనపై ఒక సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపి,చర్యలు తీసుకోవాలని నిజ నిర్ధారణ కమిటీ తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల ప్రజా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,హైకోర్టు అడ్వకేట్ జయ వింద్యాల, భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు,అడ్వకేట్ బాలాజీ నాయక్ డిమాండ్ చేశారు.గురువారం వారు గుర్రంపోడు భూముల ఘటన గురించి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గుర్రంపోడు భూముల వ్యవహారంపై ఒక కమిషన్ నియమించాలన్నారు.ఆ కమిషన్ ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని, వారిపై ఉన్నటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని, పట్టాలు మంజూరు చేయాలని కోరారు.
స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఘటనపై నోరు విప్పాలని, గిరిజన రైతులపై దాడులు జరుగుతుంటే,అక్రమ కేసులు పెడితే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.గిరిజనులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకూ ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాదిత రైతులు మరియు శ్రీనివాస్ రెడ్డి,రవి నాయక్,రాజు,బాలు,విజయ్, తదితరులు పాల్గొన్నారు.