నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఇంటర్ ప్రశ్నాపత్రాలు

సూర్యాపేట జిల్లా: ఈనెల 28 నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల నేపథ్యంలో శనివారం కట్టుదిట్టమైన భద్రతా నడుమ నల్లగొండ నుండి నేరుగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాయి.ఈ సందర్భంగా నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల,డిఇసి మెంబర్ లక్ష్మయ్య మండలానికి సంబంధించి ప్యాక్ చేసిన ప్రశ్నపత్రాలను పరిశీలించి, పోలీసుల ఆధ్వర్యంలో ప్రశ్న పత్రాలను ట్రంక్ పెట్టెలలో పోలీస్ స్టేషన్ లాకర్లలో భద్రపరిచారు.

 Inter Question Papers Reached Nereducharla Police Station, Inter Question Papers-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 28 నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్ష ప్రశ్న పత్రాలను జాగ్రత్తగా భద్రపరిచామన్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రతతో ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చీప్ సూపర్ండెంట్ మాధవి, డిపార్ట్మెంట్ ఆఫీసర్ వీరయ్య,సూర్యాపేట జిల్లా జూనియర్ కాలేజ్ లెక్చరర్, రూట్ ఆఫీసర్ డా.సతీష్, ఉపేందర్,శ్రీను పోలీసులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube