సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలంలోని గానుగబండ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళం వేసి ఉండడంతో ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.
బంగారు తెలంగాణలో ప్రజలకు సేవలందించాల్సిన ఆరోగ్య ఉప కేంద్రం ఇలా మూసివేసి,అనారోగ్యం తెచ్చిపెట్టే బెల్ట్ షాపులు మాత్రం ఊరువాడా తెరిచే ఉంచారని మండిపడ్డారు.