సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండలం( Nuthankal )లో గత నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరాలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని,వేళాపాళా లేకుండా కోతలు విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని శనివారంసూర్యాపేట జిల్లా ( Suryapet District )నూతనకల్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు రైతులు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు( Farmers ) మాట్లడుతూ 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం,కనీసం ఎనిమిది గంటలు కూడా విద్యుత్ అందించడం లేదని మండిపడ్డారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా 24 గంటల విద్యుత్ సరఫరా కావడం లేదని,దమ్ముంటే నిరూపించాలని స్థానిక ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.సబ్ స్టేషన్ లో ఒక్క అధికారి కూడా లేకపోవడంతో రైతులు ఆపరేటర్ ను అడుగగా పై నుండే రావట్లేదని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై రైతుల 30 నిమిషాల పాటు ధర్నానిర్వహించారు.
దీనితో రాకపోకలకు అంతరాయం ఏర్పడి అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.