పహారాకాచి దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు: అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల పరిధిలోని మర్రికుంట,పోనుగొడు రిజర్వాయర్,కపుర్యతండ, తాళ్ళబండ గ్రామ శివారులోని ఎన్ఎస్పీ కాలువ కట్టపై గత కొద్దిరోజులుగా మోటర్లను దొంగలించి కాల్చి దానిలోని రాగి వైర్ ను అమ్ముకుంటున్న దొంగల ముఠాను శుక్రవారం పక్కా సమాచారంతో ఉదయం 4గంటల నుండి గరిడేపల్లి ఎస్ఐ వెంకట్ రెడ్డి పోలీస్ సిబ్బందితో పహారా కాసి మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.

 Police Caught A Gang Of Robbers Additional Sp Nageswara Rao, Suryapet Police, Ca-TeluguStop.com

గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ప్రకాశ్,సీఐ రామలింగారెడ్డి,ఎస్ఐ వెంకట్ రెడ్డి లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.

నేతపురం గ్రామానికి చెందిన పసుపులేటి రాంబాబు,బుర్రి బంగారి, తన్నేరు నర్సింహ,తుమ్మడం గ్రామానికి చెందిన సండ్రర్ల అశోక్,ఆత్మకూరు గ్రామానికి చెందిన అవిరెండ్ల రిత్విక్ లు ముఠాగా ఏర్పడి దొంగలించిన రాగి,ఇత్తడిని వేములపల్లికి చెందిన మదాస్ కోటేష్,

మిర్యాలగూడకు చెందిన అన్నేపు కొటేష్ విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకొని వారి నుండి రెండు బైక్ లు,ఒక ఆటో,5 కేజీ రాగి వైరు స్వాధీనం చేసుకుని 14 కేసులలో రిమాండ్ కి తరలించామని చెప్పారు.దొంగతనాలు చేసిన వారిలో తుమ్మడం గ్రామానికి చెందిన సండ్రాల సైదులు,నేతపురం గ్రామానికి చెందిన తన్నేరు అంజి,పొడిల్ల నవీన్ పరారీలో ఉన్నారని,వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube